ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ పాటలు ఇప్పుడే కాదు మరో వందేళ్ల వరకు కూడా ఎవర్‌గ్రీన్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఆయన సంగీతంలో ఉన్న మాధుర్యం అలాంటిది. రెహమాన్ పాటలు విన్న ప్రతీసారీ మనసు తేలికపడుతుంటుంది. అయితే, ఆయన కష్టపడి కంపోజ్ చేసిన పాటలను రీమిక్స్ పేరుతో నాశనం చేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెహమాన్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అయివుండి కూడా రెహమాన్ ఎక్కువగా మీడియా ముందుకు రారు. కానీ తన పాటలను రీమిక్స్‌లుగా మార్చి నాశనం చేస్తున్నారంటూ తొలిసారి మీడియా ముందుకు వచ్చి ఆగ్రహ వ్యక్తం చేసారు.
నా పాటలన్నీ నాశనం చేసారు, వినలేకపోతున్నా: ఏ.ఆర్ రెహమాన్ ఆగ్రహం